Saturday, January 18, 2025
Homeసినిమాబేబమ్మ ఆశ ఫలించేనా?

బేబమ్మ ఆశ ఫలించేనా?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో.. ఆ పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించింది. తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో మెప్పించిన ఈ ఉప్పెన బ్యూటీ వరుసగా ఆపర్స్ అందుకుంటూ కెరీర్ లో దూసుకెళుతుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నటిస్తుంది. అలాగే సుధీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా నటిస్తుంది. దీనికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ ని తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటించేందకు ఓకే చెప్పిందని తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడిన బేబమ్మ.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేసింది.

అయితే.. మీ కోరిక ఏంటి అని కృతిశెట్టిని ఓ అభిమాని ప్రశ్నించగా.. తనకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉందని చెప్పింది. ఆ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తన మనసులో మాటలను బయటపెట్టింది. తనకు టాలీవుడ్‌ బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులు తన పై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. మరి.. బేబమ్మ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..? ఆమె కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్