వన్డే వరల్డ్ కప్ లో ఇండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో ఘన విద్జయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఇండియా 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తరువాత తనదైన ఆట తీరు, షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ 63బంతుల్లో సెంచరీ పూర్తి చేసి వన్డే వరల్డ్ కప్ లో క్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఇండియన్ గా రికార్డు నెలకొల్పాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన ఇషాన్ జట్టు స్కోరు 156వద్ద అవుట్ కాగా, 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131 పరుగులు చేసిన రోహిత్ శర్మ 205 స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ- 56; శ్రేయాస్ అయ్యర్-25 పరుగులతో నాటౌట్ గా నిలిచి మిగిలిన తంతు పూర్తి చేశారు. బంగ్లా బౌలర్ రషీద్ కే ఈ రెండు వికెట్లూ దక్కాయి.
అంతకుముందు బంగ్లా బ్యాటింగ్ లో కెప్టెన్ షాహీది-80; అజ్మతుల్లా-60 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా తన ఫామ్ ప్రదర్శించి నాలుగు వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యా 2; ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
రోహిత్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.