వన్డే క్రికెట్ లో దాయాది పాకిస్తాన్ పై ఇండియా మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్ ను 191 పరుగులకే కట్టడి చేసింది. ఈ లక్ష్యాన్ని ఇండియా ౩౦౩. ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. రోహిత్ శర్మ మరోసారి రాణించి 63 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి ఔట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ (53) సాధించి అజేయంగా నిలిచాడు.
టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 41 పరుగుల వద్ద తొలి వికెట్ (షఫీక్-20) కోల్పోయింది. కెప్టెన్ బాబర్ అజామ్-50; రిజ్వాన్-49; ఇమామ్ ఉల్ హక్-36 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో 42.5 ఓవర్లలో పాకిస్తాన్ ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ఇండియా ధాటిగా ఆరంభించింది. సొంత మైదానంలో ఆడుతోన్న తొలి సారి వరల్డ్ కప్ ఆడుతోన్న శుభ్ మన్ గిల్ 16 వెనుదిరిగి నిరాశ పరిచాడు. విరాట్ కోహ్లీ కూడా 16 రన్స్ సాధించి ఔటయ్యాడు. కెఎల్ రాహుల్ 19 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది 2, హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు.
జస్ ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో దాయాది దేశాలు ఇప్పటి వరకూ 8 సార్లు తపలడగా పాక్ ఏ ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేకపోయింది.