Friday, March 13, 2026
Homeసినిమామెగా 156 మూవీ టైటిల్ గా 'విశ్వంభర'?

మెగా 156 మూవీ టైటిల్ గా ‘విశ్వంభర’?

చిరంజీవి ఈ సారి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకుని వచ్చేశారు. ఆయన తన 156వ సినిమాను శ్రీవశిష్ఠ దర్శకత్వంలో చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీవశిష్ఠ వైపు నుంచి ‘బింబిసార’ మాత్రమే భారీ విజయంగా కనిపిస్తుంది. అయినా ఆయన పట్ల గల నమ్మకంతో ఇంత పెద్ద ప్రాజెక్టును అప్పగించడం విశేషం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమాలో కథానాయికలు ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. కథాపరంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలకు చోటు ఉంటుందట. అనుష్క .. నయనతార .. త్రిష పేరు మాత్రం వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు ప్రధానమైన నాయికగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రతినాయకుడిగా రానా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విలన్ రోల్ చేయడానికి ఆల్రెడీ రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా అంటున్నారు. అయితే ఇది ఇంతవరకూ ప్రచారంగానే ఉంది .. అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఇక ఈ సినిమాలో ‘విశ్వంభర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ కి ఈ టైటిల్ నచ్చిందనే మాట కూడా వినిపిస్తోంది. మెగాస్టార్ ఇమేజ్ కి తగిన స్థాయిలోనే ఈ టైటిల్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి ఈ టైటిల్ నే సెట్ చేస్తారా? లేదా మరేదైనా టైటిల్ మేకర్స్ పరిశీలనలో ఉందా? అనే విషయం తెలియవలసి ఉంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మ్యూజికల్ హిట్ గా ఆయన ఈ సినిమాను నిలబెట్టే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular