13.4 C
New York
Sunday, December 10, 2023

Buy now

Homeసినిమా బాలయ్య స్పీడు మామూలుగా లేదుగా..

 బాలయ్య స్పీడు మామూలుగా లేదుగా..

నందమూరి బాలకృష్ణ కరోనా టైమ్ లో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కరోనా కారణంగా థియేటర్స్ కి వెళ్లడం మరచిపోయిన జనాలను మళ్లీ సినిమా హాలు వైపు పరుగులు పెట్టించాడు. బాలయ్య, బోయపాటి కాంబో మూవీ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండడంతో అఖండ అద్భుతమైన విజయం సాధించింది. ఇండస్ట్రీలో ఓ ఊపు తీసుకువచ్చింది. ఈ సినిమాని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డికి భారీగా లాభాలు అందించింది.

అఖండ తర్వాత బాలయ్య నుంచి వీరసింహారెడ్డి అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చింది. ఈ చిత్రాన్ని మలినేని గోపీచంద్ తెరకెక్కించారు.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుని బాలయ్యకు మరో విజయాన్ని అందించింది. ఇలా వరుసగా బాలయ్య రెండు విజయాలు అందుకోవడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇప్పుడు బాలయ్య.. భగవంత్ కేసరి అంటూ వచ్చాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అందర్నీ ఆలోచింపచేసే కథతో ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించారు. అంతే కాకుండా.. ఈ మూడు చిత్రాలు వరుసగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. మొత్తానికి బాలయ్య స్పీడు మామూలుగా లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్