రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కులగణనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోనేడు సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సిఎం జగన్ అభిప్రాయపడ్డారు. దీనితో పాటు జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. కేబినేట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వివరించారు.
కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు:
- స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) నిర్ణయాలకు ఆమోదం
- జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు
- మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సిఎం సూచన
- నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం
- 6, 790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్పై బోధన.
- క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం
- ఫెర్రోఅలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు.
- దీంతో ప్రభుత్వంపై రూ.766 కోట్ల భారం.
- 50 వేల మంది కార్మికులు ఆధార పడినందుకు ఈ నిర్ణయం