1.2 C
New York
Tuesday, November 28, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇంటికి దూరంగా ఓ ఇల్లు

ఇంటికి దూరంగా ఓ ఇల్లు

Foreign House: “వివాహం అంటే ఇద్దరు ఒక్కటి కావడం…పెళ్లి అంటే ముందు ఇల్లు కట్టుకుని, ఆ తర్వాత జంటగా మారి ఓ ఇంటివాడు కావడం… రెంటికీ ఎంతో తేడా ఉంది” ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ యువకుడు చెప్పిన మాట.. ఇంటికి అంత ప్రాధాన్యం ఉంది. యాభై గజాల్లో అయినా మన సొంతిల్లు ఉంటే చాలనుకునే రోజులు పోయి అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, గ్రాండ్ విల్లేలు… రకరకాల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. శ్రీమంతుల అభిరుచికి అనుగుణంగా  ఇంటి నిర్మాణంలో ఆధునిక హంగులు దిద్ది… బార్, మినీ థియేటర్, లాన్, గార్డెన్, స్మిమ్మింగ్ పూల్ లాంటి ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు విదేశాల్లో విల్లాలు, ఎస్టేట్ లు కొనుగోలు చేయడం చూశాం. 2021లో  ముఖేష్ అంబానీ లండన్ లో ౩౦౦ ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్టోక్స్ పార్క్ భవనాన్ని 592 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనం 40 గదులతో విశాలమైన గార్డెన్, స్మిమ్మింగ్ పూల్ తో ఉంది. తాజాగా మరో ట్రెండ్ మొదలైంది…  ఇండియాలోని శ్రీమంతులు  విదేశాల్లో పెద్ద పెద్ద భవంతులు కొనుక్కొని వాటిని హాలిడే స్పాట్ లుగా మార్చుకోవడమో లేదా కొని అద్దెలకు ఇవ్వడమో చేస్తున్నారు. అడపా దడపా విదేశాల్లో పర్యటించే వారు… ఇప్పటికే విదేశాల్లో ష్టిరపడిన వారు అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

దుబాయ్, లండన్, న్యూయార్క్ తో పాటు, ఆస్ట్రియా, ఈజిప్ట్, జోర్డాన్ దేశాల్లో పెట్టుబడులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ తర్వాత ఆంటిగ్వా, బార్బుడా, డొమినికా, గ్రెనెడా, మాల్టా, సెయింట్ కిట్స్, సెయింట్ లూసియా ప్రాంతాలు కూడా ఉన్నాయి. లగ్జరీ ఔట్ లుక్ సర్వే ప్రకారం విదేశాల్లో ఆస్తులు కొనేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్న భారతీయులు 11 శాతం వరకూ ఉన్నారట. 2021 నాటికి ఈ సంఖ్య నామమాత్రంగానే ఉండేది.

మొదట విదేశాల్లో ఆస్తులు కొనడం ద్వారా అక్కడ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, గోల్డెన్ విసా సౌకర్యం పొందేందుకు మార్గం సులభం కానుంది. ఆయా దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా దీనికి అనుగుణంగా పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాల్సిన కనీస మొత్తాన్ని కూడా  తగ్గిస్తున్నాయి.

దుబాయ్ లో ఈ ఏడు తొలి త్రైమాసికంలో ఈ రంగంలో పెట్టుబడులు 20 శాతానికి పెరిగాయి.  పోర్చుగల్ లో ఈ రంగంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 55 శాతం భారతీయుల నుంచే వచ్చాయి. 2 లక్షల యూరోలు నాన్ రిఫండబుల్ సొమ్ము చెల్లించి కనీసంగా ఐదు లక్షల యూరోల పెట్టుబడులు కూడా ఈ దేశంలో పెట్టొచ్చు.

గత పదిహేనేళ్ళుగా ఫామ్ హౌస్ సంస్కృతి మన దేశంలో వచ్చింది. మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో నివసిస్తున్న ధనికులు వూరికి దూరంగా ఫామ్ హౌస్ లు,  ఫామ్ లాండ్ లు ఏర్పాటు చేసుకొని వారాంతంలో అక్కడ గడిపి వస్తున్నారు. సిటీ బిజీ లైఫ్,  కాలుష్యానికి  దూరంగా, ఆహ్లాదకర వాతావరణంలో  సేద తీరి రీఛార్జ్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కేవలం ఇంటి నిర్మాణంతోనే సరిపెట్టకుండా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాయి.  రాబోయే కాలంలో మీ చిరునామా ఏది అని అడిగితే  ఏ దేశంలో… అని అడిగే పరిస్థితులు రాబోతున్నాయన్నమాట!

RELATED ARTICLES

Most Popular

న్యూస్