విశాఖ టెస్టులో ఇండియా పట్టుబిగించింది. జస్ ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచి ఆరు వికెట్లతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 253 పరుగులకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 336 పరుగులతో నేడు రెండో రోజు ఆట మొదలు పెట్టిన ఇండియా 396 రన్స్ కు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.
తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 59 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు జాక్ క్రాలే- ఓలీ పోప్ 55 రన్స్ జోడించారు. ఆ తరువాత సరైన భాగస్వామ్యం నెలకొల్పడంలో ఆతిథ్య జట్టు విఫలమైంది. జాక్ క్రాలే-76; బెన్ స్టోక్-47 పరుగులతో రాణించగా… బెయిర్ స్టో-25; ఓలీ పోప్-23; డక్కెట్-21 రన్స్ చేశారు. 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో బుమ్రా 6; కుల్దీప్ యాదవ్ 3; అక్షర్ పటేల్ ఒక వికెట్ సాధించారు. ఇండియా 143 పరుగుల ఆధిక్యం సంపాదించింది,.
నేడు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రోహిత్ సేన ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగుఉలు చేసింది. రోహిత్-13; యశస్వి జైస్వాల్-15 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా ఇండియన్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది.