నిరుద్యోగ యువత ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ ను నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఏప్రిల్7న ఫలితాలు విడుదల చేసి జూన్ లో నియామక ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.
6100 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. వీటిలో 2292 స్కూల్ అసిస్టెంట్, 2280 ఎస్జిటీ, 1264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి.
పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది
ఈనెల 12న ఈ పోస్టుల ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలు కానుంది.
12 నుంచి 22 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
మార్చి 15 నుంచి 20 వరకూ డీఎస్సీ పరీక్షల నిర్వహణ
మార్చి 31న ప్రాథమిక కీ విడుదల
ఏప్రిల్ 1 న ప్రాథమిక కీ లోని అభ్యంతరాలు పరిశీలించి 2న ఫైనల్ కీ విడుదల
ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల
ఈనెల 8 న TET నోటిఫికేషన్
18 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకూ రెండు విడతలుగా TET పరీక్షలు నిర్వహణ
మార్చి 14న TET ఫలితాలు విడుదల