Sunday, September 8, 2024
HomeTrending Newsమార్చి లోగా ఉద్యోగుల బకాయిలు విడుదల: బొత్స

మార్చి లోగా ఉద్యోగుల బకాయిలు విడుదల: బొత్స

పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని వీలైనంత త్వరలో ప్రకటించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు  కోరుతున్నాయని, కొన్ని అంశాలు సంఘాలు తమ దృష్టికి తీసుకొచ్చాయని, మరి కొన్ని అంశాలపై క్లారిటీ కావాలని అడిగారని, ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కోరామని వెల్లడించారు.

ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన 5,500 కోట్లు మార్చి నెలాఖరు లోగా విడుదల చేస్తామని బొత్స హామీ ఇచ్చారు.  వైజాగ్ లో హత్యకు గురైన ఎమ్మార్వో కుటుంభానికి 50 లక్షల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్