Friday, September 20, 2024
HomeTrending Newsరైతుల ఆందోళన: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

రైతుల ఆందోళన: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఢిల్లీ వైపు వచ్చే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ రహదారులను మూసివేస్తున్నారు. కాంక్రీట్‌ దిమ్మెలు, స్పైక్‌ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్‌ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్‌ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన రైతు చట్టాల రద్దుకు రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు రెండేళ్లపాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. సుదీర్హ ఆందోళన అనంతరం ఎట్టకేలకు ఆ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు మోడీ స్వయంగా ప్రకటించారు.  ఆ సందర్భంగా ఇచ్చిన కనీస మద్దతు ధర అంశానికి చట్టబద్ధత కల్పించాలని,  రైతు కూలీల రుణాలు రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల మీద దిగుమతి సుంకం తగ్గింపును నిరసిస్తూ రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపు ఇచ్చాయి. రైతు సంఘాల నాయకులతో  నిన్న జరిగిన  కేంద్ర మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్