Sunday, June 14, 2026
Homeసినిమాపవన్ కళ్యాణ్ సినిమా పేరు ‘ భీమ్లా నాయక్’

పవన్ కళ్యాణ్ సినిమా పేరు ‘ భీమ్లా నాయక్’

టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి ‘భీమ్లానాయక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈరోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు చిత్రం పేరును, వీడియో ను అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. చిత్రం పేరును, వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.

అనంతరం తన స్పందనను తెలియచేశారు. పవన్ కళ్యాణ్ గారి ‘భీమ్లానాయక్’ ప్రచార చిత్రాన్ని లాంచ్ చేయటం చాలా ఆనందం గా ఉంది. ఆయన అభిమానిగా ఆయనను ఎలా చూడాలని అనుకుంటామో అలా ఫెరోషియస్ గా, లైవ్లీ గా ఉన్నారు. ఈ వీడియోలో నాకనిపిస్తోంది ఖచ్చితంగా ఈ చిత్రం రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లతో పాటు నిత్య మీనన్, మురళీశర్మ, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలు, పోరాట దృశ్యాల చిత్రీకరణ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది.

తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ చిత్రానికి  ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్:‘నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి, పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, దర్శకత్వం: సాగర్ కె చంద్ర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular