మలేషియాలో జరుగుతోన్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. థాయ్ లాండ్ తో నేడు జరిగిన ఫైనల్లో 3-2తో విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల విభాగంలో ఇంతవరకూ ఒక్కసారి కూడా ఏ పతకాన్నీ గెల్చుకోలేకపోయిన మన మహిళా జట్టు తొలిసారి ఏకంగా బంగారు పతాకాన్ని సొంతం చేసుకుంది. ఇదే కాకుండా అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన మన జట్టు టాప్ 3 జట్లను ఓడించి విజేతగా నిలవడం గమనార్హం. టాప్ సీడ్ చైనాను గ్రూప్ దశలో, టాప్-2 జపాన్ ను సెమీ ఫైనల్లో, టాప్-3 థాయ్ లాండ్ ను ఫైనల్లో మట్టికరిపించింది.
నేడు ఫైనల్లో
- తొలి మ్యాచ్ సింగిల్స్ లో పివి సింధు 21-12; 21-12తో సుపనిథ పై విజయం
- రెండో మ్యాచ్ డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్- త్రెసా జాలీ 21-16; 18-21; 21-16 తో విజయం
- మూడో మ్యాచ్ సింగల్స్ లో అస్మిత చలీహా 11-21; 11-14 తో పరాజయం
- నాలుగో మ్యాచ్ డబుల్స్ లో ప్రియ-శృతి మిశ్రా 11-21;9-21 తో పరాజయం
- ఐదో మ్యాచ్, విజేతను నిర్ణయించే ఆఖరిదానిలో అన్మోల్ ఖర్బ్ 21-14; 21-9 తో విజయం సాధించడంతో ఇండియా గోడల్ మెడల్ గెల్చుకుంది.
కాగా, ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో పారాజయం పాలై వెనుదిరిగిన సంగతి తెలిసిందే.