లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగోరోజు ఆట నెమ్మదిగా సాగింది. తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. అజింక్యా రేహానే- చటేశ్వర్ పుజారా లు నెమ్మదిగా ఆడి మ్యాచ్ ను డ్రా దిశగా నడిపించే ప్రయత్నం చేశారు కానీ ఇంగ్లాండ్ తరచూ బౌలర్లను మార్చి చివరి సెషన్ లో మూడు వికెట్లు కొద్ది సమయంలోనే పడగొట్టడంతో ఇండియా ఆరు వికెట్లు కోల్పోయింది. రేహానే-61; పుజారా- 45 పరుగులు చేసి ఔటయ్యారు. రిషభ్ పంత్ -14; ఇషాంత్ శర్మ- 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్-3; మొయిన్ అలీ-2 వికెట్లు పడగొట్టగా మరో వికెట్ శామ్ కరణ్ కు దక్కింది. నాలుగోరోజు పూర్తయ్యే సమయానికి ఇండియా 154 ఆధిక్యంతో ఉంది, ఐదోరోజు మొదటి సెషన్ తో మ్యాచ్ డ్రా అవుతుందా లేదా ఫలితం తేలుతుందా అనేది ఖరారవుతుంది.