Friday, November 22, 2024
HomeTrending Newsకాబుల్ ఎయిర్ పోర్ట్ లో తొక్కిసలాట

కాబుల్ ఎయిర్ పోర్ట్ లో తొక్కిసలాట

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యాక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూసరిహద్దులన్నీ తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటకు వెళ్ళటానికి, రావటానికి కేవలం కాబుల్ లోని హమీద్ కర్జాయి  అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో నిన్నటి నుంచి కాబుల్ ఎయిర్ పోర్ట్ కు విదేశీయులతోపాటు ఆఫ్ఘన్ లు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. విమానాశ్రయం అమెరికా అధీనంలో ఉండటంతో వివిధ దేశాల రాయబార కార్యాలయాల సిబ్బంది ప్రత్యేక విమానాల ద్వారా వెళ్ళిపోతున్నారు.

అయితే కాబుల్ నగరంలో అక్కడక్కడ జరుగుతున్న గొడవలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తమను కాపాడాలంటూ వారు కూడా కాబుల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోవటంతో వేల జనం పోగవుతున్నారు. తొక్కిసలాట జరిగి అనేకమంది గాయపడ్డారు. జనం రద్దీని అదుపు చేసేందుకు అమెరికా సైనికులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు.

తాజా పరిణామాలతో కాబుల్ ఎయిర్ పోర్ట్ ను కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నట్టు ఆఫ్ఘన్ వర్గాలు ప్రకటించాయి. విమానాల రాకపోకల్ని పూర్తిగా అమెరికా సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అనుమతి లేదని ఆఫ్ఘన్, అమెరికా వర్గాలు స్పష్టం చేశాయి. విదేశీయులు తమ దేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకాలు సృష్టించ వద్దని సుమారు 60 దేశాలు తాలిబన్లకు విజ్ఞప్తి చేశాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్