Saturday, November 23, 2024
HomeTrending News56 కోట్ల టీకా డోసుల పంపిణీ

56 కోట్ల టీకా డోసుల పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న 25 వేలుగా నమోదైన కేసులు..ఒక్కసారిగా 40 శాతం మేర పెరిగి, 35 వేలకు చేరాయి. అలాగే 400కి పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.

నిన్న 17,97,559 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..35,178 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 440 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 3.22 కోట్లకు చేరగా..ఇప్పటివరకు మహమ్మారికి బలైన వారి సంఖ్య 4,32,519కు పెరిగింది.

అలాగే నిన్న 37 వేల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.52 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 1.14 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 3,67,415 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది.

56 కోట్ల టీకా డోసుల పంపిణీ..

జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనాటీకా కార్యక్రమం ప్రారంభమైంది. దాని కింద ఇప్పటి వరకు 56 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 55,05,075 మంది టీకా వేయించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్