Friday, November 22, 2024
HomeTrending Newsసూపర్ సిక్స్- షణ్ముఖ వ్యూహం అంశాలతో మేనిఫెస్టో

సూపర్ సిక్స్- షణ్ముఖ వ్యూహం అంశాలతో మేనిఫెస్టో

రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కూటమిగా జట్టు కట్టామని, కేంద్రం నుంచి సహకారం మెండుగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుజాతికి  పూర్వవైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోనే ముందుకు వచ్చామన్నారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు చేర్చాలన్నదే తమ అభిమతమన్నారు. తాము అందించే సహకారంతో వారు ఆర్ధికంగా బలపదేలా చూస్తామని, చేపలు ఇవ్వడమే కాకుండా చేపలు పట్టడం కూడా నేర్పిస్తామని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన అసాధ్యం కాదని, టెక్నాలజీని వినియోగించుకొని.. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పారు.

మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఏటా 20 వేల రూపాయల పెట్టుబడి సాయం, ఆడబిడ్డ నిధి పథకం కింద 19 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ వయసున్న ప్రతి మహిళకూ ప్రతినెలా రూ. 1500 సాయం, తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఏటా రూ. 15 వేల సాయం లాంటి పథకాలతో మేనిఫెస్టోను నేడు విడుదల చేశారు. ఉండవల్లిలో టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో బాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి జాతీయ కార్యదర్శి సిద్దార్థ్ సింగ్ లు పాల్గొన్నారు.

ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో హత్యకు గురైన వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ఈ కేసుల విచారణ రీ ఓపెన్ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని పేర్కొన్నారు.

కూటమి మేనిఫెస్టో ముఖ్యాంశాలు:

  • మెగా డీఎస్సీపై తొలి సంతకం
  • వృద్ధాప్య పెన్షన్ రూ.4000
  • దివ్యాంగుల పెన్షన్ రూ.6000
  • 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500
  • ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం
  • యువతకు 20 లక్షల ఉద్యోగాలు,  రూ.3000 నిరుద్యోగ భృతి
  • తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000
  • మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
  • ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి
  • వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
  • ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్ పథకాల పునరుద్ధరణ
  • ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్
  • బీసీ రక్షణ చట్టం
  • పూర్ టూ రిచ్ పథకం
  • అగ్రవర్ణ పేదలకు న్యాయం చేస్తాం
  • బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
  • పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
  • పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం
  • పెళ్లి కానుక రూ.1,00,000/-
  • విదేశీ విద్య పథకం
  • పండుగ కానుకలు
  • రూ. 5 వేల కోట్లతో ఆదరణ పథకం
  • గీత కార్మికులకు వైన్ షాపుల కేటాయింపులో 1౦ శాతం రిజర్వేషన్
  • సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్ధిక సాయం
  • పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ లకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
  • ఎయిడెడ్ కాలేజీలకు ఫిజ్ రీఇంబర్స్మెంట్ పునరుద్ధరణ
  • అమరావతి రాజధాని కొనసాగించి పూర్వవైభవం తీసుకువస్తాం
  • బిసి సబ్ ప్లాన్ ద్వారా లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు
  • చట్టసభల్లో బిసిలకు 33 శాతం కోసం కేంద్రంతో సంప్రదింపులు
  • బిసిల స్వయం ఉపాధికి ఏటా రూ. 10 వేల కోట్లు
  • డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకూ వడ్డీ లేని రుణం
  • ఆలయాల్లో పనిచేసే నాయూ బ్రాహ్ననులకు రూ. 2 వేల గౌరవ వేతనం
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు, దాన్ని రద్దు చేస్తాం
  • వంద రోజుల్లో డ్రగ్స్, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తాం
  • గ్రామాల నుంచి మండలం, మండలం నుంచి జిల్లా కేంద్రాలకు మౌలిక వసతులు మెరుగు పరుస్తాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్