Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్T20 WC: పంత్ కు పిలుపు, చాహల్ కు చోటు

T20 WC: పంత్ కు పిలుపు, చాహల్ కు చోటు

జూన్ లో జరిగే టి 20 వరల్డ్ కప్ లో ఆడే 15 మంది సభ్యుల ఆటగాళ్లను బిసిసిఐ ప్రకటించింది. వీరితో పాటు నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు.  గాయం కారణంగా ఆటకు దూరమైన రిషభ్ పంత్ మళ్ళీ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. 2022 డిసెంబర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ వేగంగా కోలుకొని ఈ ఏడాది ఐపీఎల్ తో మళ్ళీ మైదానంలో దిగి సత్తా ప్రదర్శిస్తున్నాడు. దీనితో అతనికి అవకాశం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

ఐపీఎల్ లో అద్భుత ఫామ్ ప్రదర్శిస్తోన్న సంజూ శాంసన్, స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్ లను కూడా జట్టులోకి తీసుకున్నారు. ఆల్ రౌండర్ శివమ్ దూబే కు కూడా అవకాశం దక్కింది.

కాగా, ఎప్పటినుంచో జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తోన్న రింకూ సింగ్ ను రిజర్వు ప్లేయర్ గా తీసుకున్నారు. ఇతనితో పాటు శుభ్ మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ లు ఈ జాబితాలో ఉన్నారు,

జూన్ 1 నుంచి 29 వరకూ జరగనున్న ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ దశలో ఇండియా తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో జూన్ 5 న ఆడనుంది.  జూన్ 9న పాకిస్తాన్, 12న యూఎస్ఏ, 15న కెనడాలతో తలపడుతుంది.

జట్టు వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్,  యజువేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

స్టాండ్ బై: శుభ్ మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్