Friday, June 12, 2026
HomeTrending Newsలోక్ సభ ఐదో విడత ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలు

లోక్ సభ ఐదో విడత ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ కొద్ది సేపటి క్రితం 8 రాష్ట్రాల పరిధిలోని 49 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్‌ జరిగే దశ ఇదే. ఐదో విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, లక్నో, అమేథీ, గొండా వంటి కీలక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుున్నాయి.

బీహార్: సీతామర్హి, మధుబని, ముజఫర్‌పూర్, సరన్, హాజీపూర్

జార్ఖండ్: చత్రా, కోడర్మా, హజారీబాగ్

మహారాష్ట్ర: ధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కళ్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్ – వెస్ట్, ముంబై నార్త్ – ఈస్ట్, ముంబై నార్త్ – సెంట్రల్, ముంబై సౌత్ – సెంట్రల్, ముంబై సౌత్

ఒడిశా: బర్ఘ, సుందర్‌డ్ , బోలంగీర్, కంధమాల్, అస్కా

ఉత్తరప్రదేశ్: మోహన్‌లాల్‌గంజ్, లక్నో, రాయ్ బరేలీ, అమేథి, జలౌన్, ఝాన్సీ, హమీర్‌పూర్, బందా, ఫతేపూర్, కౌశంబి, బారాబంకి, ఫైజాబాద్, కైసర్‌గంజ్, గోండా

పశ్చిమ బెంగాల్: బంగన్, బరాక్‌పూర్, హౌరా, ఉలుబేరియా, శ్రీరాంపూర్, హుగ్లీ, ఆరాంబాగ్

జమ్మూ కాశ్మీర్: బారాముల్లా, లడఖ్: లడఖ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(లక్నో), కేంద్ర మంత్రి స్మృతి ఇరాని (అమేథి), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి(రాయ్ బరేలి) నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా(బారాముల్లా), ఎల్‌జేపీ తరఫున చిరాగ్ పాశ్వాన్(సరన్) ప్రముఖులు బరిలో ఉన్నారు.

-దేశవేని భాస్కర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular