టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో దీనికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు నాగార్జున. ఇప్పటికి అంతా సెట్ అయ్యింది. ఈ క్రేజీ మూవీని ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది నాగార్జున ప్లాన్. బంగార్రాజు గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. సంక్రాంతికి రిలీజ్ చేయడం కుదరుతుంది అనుకుంటేనే బంగార్రాజు మూవీ స్టార్ట్ చేస్తానని నాగార్జున చెప్పేవారు. అందుచేత ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు అని తెలుస్తోంది. మరి.. సోగ్గాడే చిన్ని నాయనా సక్సస్ సాధించినట్టుగానే.. బంగార్రాజు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధిస్తుందని ఆశిద్దాం.