మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్‌, గ్లామ‌ర్ డాల్ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రానికి  ‘కొండ‌పొలం’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రొడ‌క్ష‌న్‌.నెం.8గా రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్ సినిమా పై ఆస‌క్తిని మ‌రింత పెంచింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్లు అర్ధమవుతోంది.

వైష్ణ‌వ్ తేజ్ గ‌డ్డం, ఇన్‌టెన్స్ లుక్‌తో చూడ‌టానికి చాలా హ్యండ్‌స‌మ్‌గా క‌నిపిస్తున్నాడు. త‌నే నేచుర‌ల్‌లో ఓ భాగ‌మ‌నే విష‌యాన్ని పోస్ట‌ర్ తెలియ‌జేస్తుంది. అలాగే కొంత మంది అడ‌విలో న‌డుచుకుని వెళుతున్న‌ట్లు తెలుస్తుంది. బ్యాగ్రౌండ్‌లో గొర్రెలు గ‌డ్డి తింటున్నాయి. టైటిల్ పోస్ట‌ర్‌, ఫ‌స్ట్ లుక్ సినిమా పై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఇక వీడియో చూస్తే అడ‌విలోని దుండ‌గులను అడ్డుకోవ‌డానికి వైష్ణ‌వ్ తేజ్ వ‌డిసె తిప్పుతూ క‌నిపించాడు. త‌న చూపుల్లో ఓ ఉగ్రం క‌నిపిస్తుంది. విజువ‌ల్స్ గ్రాండియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. నేప‌థ్య సంగీతం ఎమోష‌న్స్ ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నాయి.

`ఎపిక్ టేల్ ఆఫ్ బిక‌మింగ్‌` అని పోస్ట‌ర్‌లో ఓ లైన్‌లో చూడొచ్చు. అలాగే నిర్మాత‌లు ‘కొండ‌పొలం’ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న థియేట‌ర్లలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవలను ఆధారంగా చేసుకుని ఈ అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *