Friday, September 20, 2024
Homeసినిమా'ధూమం' ఇంట్రెస్టింగ్ కంటెంటే .. కానీ .. ! 

‘ధూమం’ ఇంట్రెస్టింగ్ కంటెంటే .. కానీ .. ! 

ఫహాద్ ఫాజిల్ .. మలయాళంలో పెద్ద స్టార్. అక్కడ ఆయన డేట్స్ దొరకడం కష్టం. పెద్దగా మేకప్ లేకుండా తెరపై కనిపించడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర తప్ప మనకి ఫాజిల్ కనిపించడు. అందువల్లనే అక్కడ ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు తెలుగు వెర్షన్ లో ఓటీటీలో రావడం వలన .. ‘పుష్ప’ సినిమాలో ఆయన విలన్ గా చేయడం వలన తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.

అలాంటి ఫాజిల్ హీరోగా రూపొందిన ‘ధూమం’ మలయాళంలో పోయిన ఏడాది థియేటర్లకు వచ్చింది. అక్కడ ఈ సినిమా యావరేజ్ అనిపించుకుంది. అలాంటి ఆ సినిమా మొన్నటి నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. హోంబలే వంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓ సిగరెట్ సంస్థ .. లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ సంస్థలో కీలకమైన స్థానంలో ఉద్యోగిగా మన హీరో పనిచేస్తూ ఉంటాడు.

ఈ కథ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. హీరో .. అతని భార్య ఒక ఆపదలో చిక్కుకుంటారు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. హీరో భార్య శరీరంలో మైక్రో బాంబ్ అమర్చి ఉంటుంది .. దాని రిమోట్ శత్రువు చేతిలో ఉంటుంది. ఆ విషయం ఆ భార్యకి తెలియదు. ఆ సంగతి ఆమెకి చెప్పకుండా రక్షించుకోవాలి అది హీరో ఆలోచన. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? వాళ్లను చంపాలనుకుంటున్నది ఎవరు? ఎందుకోసం? అనేది కథ.

కథ అంతా కూడా ప్రీ క్లైమాక్స్ వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళుతుంది. అయితే ఏదైతే కారణంగా హీరో – హీరోయిన్ ఇబ్బంది పడుతున్నారో, వాళ్లని ఏ కారణంగా ఎవరైతే ఇబ్బంది పెడుతూ వస్తున్నారో ఆ కారణం రొటీన్ గా అనిపిస్తుంది. ఆ ఒక్క విషయంలో కొత్తదనం చూపించి ఉంటే, ఈ సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేదేమో అనిపిస్తుంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఆ కాసేపు నడిచే కంటెంట్ ను పట్టించుకోకపోతే బాగానే ఉంటుంది మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్