దుబాయ్ నుంచి ముంబై వరకు సముద్రంలో ట్రైన్ టన్నల్ ప్రాజెక్ట్ ప్రణాళిక సిద్దమవుతోంది. ట్రైన్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దుబాయ్ నుంచి ముంబైకి 2 గంటలలో చేరుకుంటుంది. దీంతో రెండు దేశాల మధ్య ప్రయాణం సులభతరం అవుతుందని నిపుణుల అంచనా. ఫుజైరా ఓడరేవు నగరం నర్మదా నది నుండి UAEకి మంచినీటిని తీసుకువెళుతూ… భారతదేశానికి చమురును ఎగుమతి చేస్తుంది.
రైలు మార్గం కింద రెండు పైప్ లైన్లు ఉంటాయి. ఇండియా నుంచి నర్మదా నది నీరు తాగునీటి కోసం దుబాయ్ కి వెళుతుంది. దుబాయ్ నుంచి చమురు ఇండియాకి సరఫరా అవుతుంది. ఒప్పందం ప్రకారం పైప్ లైన్ ద్వారా ఇవి రెండు జరుగుతాయి. రెండు గమ్యస్థానాల మధ్య దూరం 1,240 మైళ్లు (2,000 కి.మీ) కంటే తక్కువగా ఉంటుంది. అయితే లోతైన నీటిలో నిర్మించడం పెద్ద సవాలుగా నిలిచింది. సాధారణ ఇటుకలతో సొరంగం వేయడానికి బదులుగా, సముద్రం నీటి అడుగున సుందరమైన వీక్షణలకు అనుగుణంగా సీ-త్రూ విండోలను ఉపయోగించవచ్చని నివేదికలలో చర్చిస్తున్నారు.
ఏ రకమైన రైళ్లను ఉపయోగించాలి… నిర్మాణం వివరాలు సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకుంది. తే నిస్సందేహంగా చాలా పెట్టుబడి అవసరం, కొన్ని బిలియన్ డాలర్ల నిధులు అవసరం అవుతుంది. ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందా లేదా అనే అంశంలో ప్రాథమిక ఆందోళన నిధులు కాదు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లను కలుపుతూ ఉన్న ఛానల్ టన్నెల్ నీటి అడుగున నిర్మించిన సాంకేతికతపై అధ్యయనం జరుగుతోంది.
వ్యత్యాసం ఏమిటంటే ఇంగ్లీష్ ఛానల్ టన్నెల్ కేవలం 35 మైళ్ల (56 కిమీ) పొడవు ఉంటుంది. రైలు దాని గుండా ప్రయాణిస్తున్నప్పుడు గంటకు 70 మైళ్ల(112 కిమీ) వేగంతో వెళుతుంది. దుబాయ్ కి వెళ్ళేది 50 రెట్ల పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని… రైలును పది రెట్లు వేగంగా నడపాలని యోచిస్తున్నారు.
ఫుజేరా ద్వారా దుబాయ్ నుండి ముంబై వరకు, UAE సొరంగం భావన నీటిలో సొరంగాలు, ఆఫ్‌షోర్ నిర్మాణాలు సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. తేలియాడే నీటి అడుగున సొరంగాలు అరేబియా సముద్రం ఉపరితలం క్రింద మునిగిపోయే రెండు వక్ర కాంక్రీటు గొట్టాలను కలిగి ఉంటాయని అంటున్నారు.
దుబాయ్‌కి ప్రయాణించే సమయం విమానంలో మూడు గంటల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. విమానయానానికి ముందు ఉండే లాంఛనాలు ఇందులో లేవు. రైలుకు మారడం ద్వారా, UAE కనీసం ఒక గంట ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. రైలు గంటకు 600 మైళ్ల (1,000 కి.మీ) వేగంతో ప్రయాణించగలదు.
ఈ ప్రాజెక్ట్ ప్రయాణీకులకు మాత్రమే సేవ చేయడానికి ఉద్దేశించినది కాదు. దుబాయ్ భారతదేశం మధ్య వాణిజ్యాన్ని విస్తరించే సాధనంగా ఉపయోగపడుతుంది. దీంతో రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత పెరిగి… పశ్చిమాసియాతో మన దేశానికి సంబంధాలు బలపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
-దేశవేని భాస్కర్