ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టిన ఘనత ఆమెకు దక్కుతుంది. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న యామినీ కృష్ణమూర్తి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1940లో మదనపల్లెలో ఆమె జన్మించారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. దిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకం రచించారు.
యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు.