Tuesday, April 1, 2025
Homeసినిమాఆకట్టుకున్న మహేష్ బాబు లుక్

ఆకట్టుకున్న మహేష్ బాబు లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొడవైన జుట్టు, పెరిగిన గడ్డంతో రాజమౌళి సినిమాకు మేకోవర్ అవుతున్నట్లు కనిపించారు. ఇటీవలి వరదల్లో బాధితులను ఆదుకునేందుకు  ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ చెక్ ను మహేష్ బాబు దంపతులు అందజేశారు.  దీనితో పాటు  AMB మాల్ తరపున మరో రూ.10లక్షలు కూడా విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో సునీల్ నారంగ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో, ఫోటోలలో మహేష్ బాబు లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మాతగా ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తోన్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలుకానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్