Saturday, November 23, 2024
HomeTrending Newsచర్చల ఆలోచన లేదు: బొత్స

చర్చల ఆలోచన లేదు: బొత్స

అమరావతి రైతులతో చర్చలు జరిపే ఆలోచన ఏదీ లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని, కోర్టుల్లో ఉన్న ఇబ్బందులను తొలగించుకుని ముందుకు వెళతామని వెల్లడించారు.

శాసన రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని,  ఈ విషయాన్ని శాసన సభలోనే వెల్లడించామని, ప్రభుత్వం తరఫున రైతులకిచ్చే పరిహారాన్ని ఇంతకుముందు ఇస్తున్న దానికంటే ఎక్కువే ఇస్తున్నామని, ఈ  విషయంలో అందోళన అవసరం లేదని వెల్లడించారు. ఇంకా దీనిపై చర్చించాల్సింది ఏముంటుందని, అయినా తాము చెప్పిందే జరగాలని వారు చెబుతుంటే ఇంకా చర్చలేమిటన్నారు బొత్స.  20 గ్రామాల రాజధానికి కట్టుబడి ఉండాలా? కేవలం ఒక సామాజిక వర్గం అభివృద్ధి కోసమే పనిచేయాలా? అంటూ ప్రశ్నలు వేశారు.

నిన్న రాజమండ్రిలో కూడా అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని  విశాఖకు తరలింపు ఖాయమని,  సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.  చంద్రబాబుకు, లోకేష్ కు  అడ్రస్ ఎక్కడ ఉందని, వారి నివాసాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నామంటూ ప్రక్కరాష్ట్రంలో వుంటారా అంటూ నిలదీశారు.  ప్రతిపక్షంలో వుండగానే జగన్ తాడేపల్లి లో ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు. అమరావతి కౌలు రైతులకు ముందుగానే కౌలు చెల్లిస్తున్నామని నిన్న రాజమండ్రిలో బొత్స వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ రాజధాని అంశంపై నేడుకూడా స్పందించడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్