Saturday, July 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్గోవధ నిషేధ చట్టం అమలు చేయండి: సోము

గోవధ నిషేధ చట్టం అమలు చేయండి: సోము

గోవధ నిషేధంపై కేంద్రం చట్టం చేసినప్పటికీ బీజేపీయేతర రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు ఆరోపించారు.  విజయనగరం జిల్లాలో గోమాంసం లారీని పట్టుకున్న సంఘటనపై వీర్రాజు స్పందించారు. గోవధ నిషేధం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లాలో ఓ లారీలో పశుమాంసాన్ని తీసుకెళుతుండగా మైనారిటీ మోర్చా నేతలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. లారీ నెంబరు ప్లేటుకు స్టిక్కర్ అంటించుకుని 20 టన్నుల గోమాంసాన్ని తరలిస్తుండగా వారు అడ్డుకున్నారు. ఇటీవల అధికార వైసీపీ ఎమ్మెల్యే గోవధపై చేసిన వ్యాఖ్యల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అయన మండిపడ్డారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, గోవులపై దారుణాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలను బీజేపీ, హిందూ సంఘాలు, గోరక్షక దళాలు ఎంతమాత్రం సహించబోవని సోము వీర్రాజు హెచ్చరించారు.

ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం స్పందించాలని, గోవులపై అఘాయిత్యాలకు తెగబడుతున్నవారిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను అమలు చేయడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్