Friday, June 12, 2026
Homeసినిమారాజమౌళి - మహేశ్ బాబు మూవీ టైటిల్ ఇదేనా?

రాజమౌళి – మహేశ్ బాబు మూవీ టైటిల్ ఇదేనా?

మహేశ్ బాబు అభిమానులంతా ఇప్పుడు ఆయన రాజమౌళితో చేయనున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకపోయినా, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి కుతూహలాన్ని కనబరుస్తున్నారు. ఇంతవరకూ తెరపై మహేశ్ కనిపించిన విధానం వేరు .. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ వేరు. ఇక మహేశ్ బాబు తన కెరియర్లోనే ఇంతవరకూ చేయని హై బడ్జెట్ మూవీ ఇది.

ఇప్పటికే విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ ను పూర్తి చేశారని చెబుతున్నారు. సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన ప్లానింగులో రాజమౌళి బిజీగా ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాకి ఏ టైటిల్ ను సెట్ చేయనున్నారనేది అభిమానులలో ఆసక్తినిరేకెత్తించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ‘గోల్డ్’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. అందునా రాజమౌళి సినిమా ప్రపంచంలో ఏ మారుమూల గ్రామం వరకూ వెళుతుందో చెప్పలేం.

‘గోల్డ్’ అనేది యూనివర్సల్ టైటిల్. అందువలన వెంటనే కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ టైటిల్ పరిశీలిస్తున్నారట. కథకి తగినదిగానే ఈ టైటిల్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు .. సాంకేతిక నిపుణుల విషయంలో కసరత్తు జరుగుతోంది. ప్రతినాయకుడిగా విక్రమ్ చేసే అవకాశం ఉందనే ఒక టాక్ మాత్రం వినిపిస్తోంది. ఆగస్టు 9వతేదీన మహేశ్ బాబు పుట్టినరోజు. ఆ రోజున టైటిల్ ను ప్రకటిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular