6.1 C
New York
Monday, December 11, 2023

Buy now

Homeసినిమాసెప్టెంబర్ 9న వస్తున్న విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ ‘లాభం’

సెప్టెంబర్ 9న వస్తున్న విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ ‘లాభం’

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ విడుదల అవుతోంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకం పై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.  లాయర్ శ్రీరామ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

విజయ్ సేతుపతి నటించిన మాస్టర్, ఉప్పెన తరువాత తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ  ‘విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘లాభం’ చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదల కావడం విశేషం’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్