విశాఖను పరిపాలనా రాజధాని చేయడంపై తెలుగుదేశం పార్టీ ఓ స్పష్టమైన వైఖరి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల మంత్రి అవంతి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకువెళ్తోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఉత్తరాంధ్ర రక్షణ-చర్చా వేదికపై అవంతి స్పందించారు.
అవంతి మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:
- టిడిపి నేతలకు ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడే హక్కు లేదు
- అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారు.
- ఇప్పుడు చర్చావేదికలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు
- పాలనా రాజధానిగా కొనసాగే అన్ని అర్హతలూ విశాఖకు ఉన్నాయి
- అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుంది
- రాష్ట్రంలో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందా? లేదా?
- మళ్ళీ ఓ యాభై ఏళ్ళ తరువాత ప్రాంతాల వారీగా కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇది సమ్మతమేనా
- భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య వైషమ్యాలు రాకూడదు
- హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు
- ఈ ఉద్దేశంతోనే మూడు రాజధానులు ప్రతిపాదన సిఎం జగన్ తెచ్చారు
- కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గతంలో టిడిపి అడిగింది
- ఇప్పుడు ఈ పార్టీ నేతలు తలోమాటా మాట్లాడుతున్నారు
- మూడు రాజధానులపై ఓ విష్పష్టమైన వైఖరి ప్రకటించాలి
- ఆ తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడడాం
- విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది
- మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళు బాగు చేశాం
- ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది
- ఇది అభివృద్ధి అంటారా లేదా అనేది టిడిపి నేతలు చెప్పాలి