పారాలింపిక్స్ లో ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుహాస్ ఎల్. యతిరాజ్ రజత పతకం గెల్చుకున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-4 విభాగంలో హోరాహోరీ గా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు లుకాస్ మజూర్ చేతిలో యతిరాజ్ ఓటమి పాలయ్యారు. మొదటి సెట్ 15-21తో యతిరాజ్ గెల్చుకున్నప్పటికీ రెండు, మూడో సెట్లలో లుకాస్ 21-17, 21-15 తేడాతో పైచేయి సాధించారు.
కర్నాటక రాష్ట్రానికి చెందిన యతిరాజ్ ఐఏఎస్ కు ఎంపికై ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ గా ఉంటూ పతకం సాధించడం దేశానికే గర్వకారణంగా చెప్పవచ్చు.
యతిరాజ్ రజత పతకంతో ఇండియా సాధించిన పతకాల సంఖ్య ౧౮ కు చేరింది. వీటిలో 4 స్వర్ణం, 8 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి పతకాల పట్టికలో ఇండియా 26వ స్థానంలో కొనసాగుతోంది.