Monday, June 8, 2026
Homeసినిమానిలకడగా ఉన్న ధరమ్ తేజ

నిలకడగా ఉన్న ధరమ్ తేజ

నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయన అవయవాలన్నీ మెరుగ్గా పని చేస్తున్నాయని అపోలో ఆస్పత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. అయన పరిస్థితిని మరికొంతకాలంపాటు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నట్లు  పేర్కొంది. ఈ రోజు అవసరమైన మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. రేపు ఉదయం మరోసారి సాయి తేజ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేస్తామని ప్రకటనలో వివరించింది.

నేటి ఉదయం అపోలో ఆస్పత్రిలో ధరమ్ తేజ ను హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు పరామర్శించారు. అయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వీరికి వివరాలు అందించారు.  ధరమ్ తేజ త్వరగా కోలుకోవాలని హీరోలు జూనియర్ ఎన్టీఆర్, విజయ దేవరకొండ ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి సాయి ధరమ్ తేజ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. గణనాథుడి దయవల్ల తేజ ప్రాణాపాయం నుంచి బైట పడ్డారని, త్వరలోనే అయన కోలుకుని బైటకు వస్తారని తలసాని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular