యువ హీరో తనీష్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘మరో ప్రస్థానం’ కావడం విశేషం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘మరో ప్రస్థానం’ చిత్రానికి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ లభించింది. వన్ షాట్ ఫిల్మ్ గా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ..’మరో ప్రస్థానం’ బాగుందంటూ సెన్సార్ సభ్యులు చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూసేలా ఉంటుంది. సినిమా చూసే వాళ్లను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. సినిమా కథంతా నేచురల్ గా ఒక ఫ్లో లో కనిపించేలా షూట్ చేశాం. థియేటర్ లో ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాం” అన్నారు. కొంత కాలంగా సరైన హిట్ లేక నిరాశలో ఉన్న తనీష్, అతని అభిమానులకు ఈ యాక్షన్ ఫిల్మ్ తో నైనా ఊరట లభించాలని కోరుకుందాం.
రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం.., సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ – క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ – జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ – కపిల్, ఫైట్స్ – శివ