Tuesday, March 10, 2026
Homeసినిమా‘ఖిలాడి’ రమేష్ వర్మ రిలీజ్ చేసిన ‘మౌనం’ ట్రైలర్

‘ఖిలాడి’ రమేష్ వర్మ రిలీజ్ చేసిన ‘మౌనం’ ట్రైలర్

లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ఆహ్లాదభరిత ప్రేమకథాచిత్రం ‘మౌనం’. పారాసైకాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ అన్నది ట్యాగ్ లైన్. ఎమ్.ఎమ్. శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా, ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించారు.

మణిరత్నం మౌనరాగం తరహాలో… తన మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలని రమేష్ వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ “మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ ‘మౌనం’. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన రమేష్ వర్మగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular