Thursday, April 25, 2024
Homeసినిమాబోర్ కొట్టించని సందేశాత్మక సినిమా ‘లవ్ స్టోరి’ : సాయి పల్లవి

బోర్ కొట్టించని సందేశాత్మక సినిమా ‘లవ్ స్టోరి’ : సాయి పల్లవి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’ సెప్టెంబర్ 24, శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి లవ్ స్టోరి సినిమా విశేషాలు, తన కెరీర్ గురించి పలు విషయాలు పంచుకున్నారు.

“దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో సినిమా కోసం పిలుపు వచ్చినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని అప్పటికే ఫిక్స్ అయ్యాను. ‘లవ్ స్టోరి’లో నా క్యారెక్టర్ విన్న తర్వాత నటించాలనే కోరిక ఇంకా గట్టిగా కలిగింది. ‘ఫిదా’లో భానుమతి క్యారెక్టర్ కు ‘లవ్ స్టోరి’ లో మౌనిక క్యారెక్టర్ కు సంబంధం ఉండదు. రెండు వేర్వేరు భావోద్వేగాలు ఉన్న క్యారెక్టర్స్.  ‘ఫిదా’లో భానుమతిది పెళ్లైతే తన నేటివ్ ప్లేస్, ఫ్యామిలీ ఎందుకు వదిలి వెళ్లాలని ఆలోచించే అమ్మాయి పాత్ర, ఈ సినిమాలో మౌనిక తన డ్రీమ్స్ ను ఫాలో అవుతుంది. నేను ఎందుకు తక్కువ అనే ఆత్మవిశ్వాసం మౌనిక క్యారెక్టర్ లో కనిపిస్తుంది. చైతూ, నా క్యారెక్టర్స్ ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక మంచి విషయాన్ని చెప్పించారు. అదేంటంటే మనలో ఎవరూ పర్ ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు..కానీ ప్రయత్నించి సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా మా రెండు క్యారెక్టర్స్ తమ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. నేను సాధించగలను అని బలంగా నమ్ముతాయి”

“మన చుట్టూ ఉన్న సమాజంలో, మన కుటుంబంలో కూడా వివక్షను చూస్తుంటాం. కానీ పోనీలే అని చాలా మంది అమ్మాయిలు, మహిళలు వదిలేస్తుంటారు. ఇంట్లో పని చేసే అమ్మాయి ఉంటే ఆమెకు వేరే ప్లేట్ లో భోజనం పెడుతుంటాం. ఇవన్నీ మన కళ్ల ముందు కనిపించే వివక్షే. వీటి గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల ఆలోచింపజేసేలా సినిమా తెరకెక్కించారు. ‘లవ్ స్టోరి’లో మంచిసందేశం ఉన్నా, ఎక్కడా బోర్ కొట్టించదు. కథను వినోదాత్మకంగా చూపిస్తూ సినిమాను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లో ఉండే నిజాయితీ ఈలోనూ ఉంటుంది. ఆయన తన జీవితంలో ఏది నమ్ముతారో దాన్నే కథలుగా మార్చి సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈ సినిమా కూడా అందులో ఒకటి”

శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు మనకు కూడా అంతే సిన్సియర్ గా వర్క్ చేయాలనే ఆలోచన వస్తుంది. ఆయన చాలా హంబుల్ గా ఉంటారు. సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ‘లవ్ స్టోరి’లో మన చుట్టూ ఉన్న లింగ, కుల వివక్ష లాంటి ఇష్యూస్ ను టచ్ చేస్తూ సినిమా చేశారు. ఈ సినిమా చూశాక ప్రేక్షకుల్లో ఒక ఆలోచన కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నాగ చైతన్యతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో వర్కింగ్ చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను. రేవంత్ క్యారెక్టర్ ను పర్ ఫెక్ట్ గా పోషించారు. పైట్స్ లో నాగ చైతన్య బాగా నటించి, సాయి పల్లవి చేయలేదంటే కరెక్ట్ కాదు కదా అలాగే డ్యాన్స్ లో నేను బాగా చేశాను, ఆయన ఇబ్బంది పడ్డారన్నా సరికాదు. ఒక్కో యాస్పెక్ట్ లో ఒక్కొక్కరు కొద్దిగా బెటర్ గా చేస్తారు అంతే

చిరంజీవి గారు నాతో డ్యాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారు. ఆయన నా డ్యాన్స్ గురించి చెబుతుంటే చాలా సంతోషం కలిగింది. అవన్నీ బెస్ట్ కాంప్లిమెంట్స్ గా నాకు గుర్తుండిపోతాయి. సొసైటీలో అమ్మాయిల మీద ఏవైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు అవి విని, చదివి నేను బాధపడేదాన్ని. మనమేం చేయలేమా అనుకునేదాన్ని. మౌనిక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ విషయంలో సంతృప్తి కలిగింది. కనీసం ఈ  సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగాను అని.  ప్రతి అమ్మాయి, మహిళ చూడాల్సిన సినిమా ఇది

“ప్రస్తుతం నేను తెలుగులో ‘విరాటపర్వం’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో నటిస్తున్నాను. ‘విరాట పర్వం’ ఇంకొక రోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ‘శ్యామ్ సింగరాయ్’ కూడా తరలో పూర్తవుతుంది. తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి” అంటూ పలు విశేషాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్