బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్సెలో క్యురోగా కు కరోనా రావటం కలకలం రేపుతోంది. బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సనారో కలిసి ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు మార్సెలో న్యూయార్క్ వచ్చారు. మంగళ వారం యుఎన్ సమావేశాల్లో క్యురోగా బ్రెజిల్ బృందంతో కలిసి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తో దౌత్యసంబంధాల బలోపేతం కోసం జరిగిన సమావేశంలో దేశాధ్యక్షుడు బోల్సోనారో తో కలిసి ఆరోగ్య మంత్రి క్యురోగా కూడా పాల్గొన్నారు.
మార్సెలో క్యురోగా మినహా బ్రెజిల్ బృందంలో ఎవరికీ కరోనా సోకలేదని ఆ దేశాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. చైనా వ్యాక్సిన్ కరోన వ్యాక్ తీసుకున్నా క్యురోగా కు మహమ్మారి సోకటం చర్చనీయాంశంగా మారింది. చైనా వస్తువులతో సహా టీకా లు కూడా నాణ్యం లేనివేనని అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా కథనాలు వేసింది న్యూ యార్క్ లో 14 రోజులు క్వారంటైన్ ఉంటానని మార్సెలో క్యురోగా ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి సమావేశాలు వివిధ అంశాలపై ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. ఆరంభంలోనే ఓ మంత్రికి కరోనా సోకటం మిగతా దేశాల వారిని కలవరానికి గురిచేసింది. ఇక నుంచి అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని యుఎన్ వర్గాలు వెల్లడించాయి.