మహారాష్ట్రలో ఈ సంవత్సరం జరిగిన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని ది ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్నది. సెప్టెంబర్ 21 న జరిగిన ఈ పోటీలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫ్లైయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా రోలింగ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని అధికారులు ఆయన అధికార నివాసంలోమర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్న అవార్డును అకాడమీ సీ.ఈ.ఓ అండ్ సెక్రటరీ ఎస్.ఎన్. రెడ్డి మంత్రి కి అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు.
2003 సంవత్సరం లో ఈ ట్రోఫీని ఏర్పాటు చేసినట్లు ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కెప్టెన్ అనీషా సురేష్ తెలిపారు.దేశవ్యాప్తంగా 21 ఫ్లయింగ్ ట్రైనింగ్ క్లబ్లు ఏరో క్లబ్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్నాయని, ఏవియేషన్ పైలట్లు మరియు ఇంజనీర్లకు అబ్-ఇనిషియో శిక్షణకు సంబంధించి ఈ ఫ్లయింగ్ క్లబ్లు విలువైన సేవలను అందిస్తున్నాయన్నారు. మహారాష్ట్రలోని జుహు కేంద్రంగా బాంబే శిక్షణ సంస్థ ఈ కార్యకలాపాలు నిర్వాహిస్తున్నది.
ఈ ట్రోపిలో ఫ్లయింగ్ క్లబ్ రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి ప్రభుత్వ విమానయానానికి లభించిందని అధికారులు మంత్రి కి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ , స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి,క్యాప్టెన్ ఎస్.ఎన్ రెడ్డి సీ.ఈ.ఓ అండ్ సెక్రటరీ, కె.ఎస్ రాజేశ్వర్ రావు AAO, ఎన్. చంద్రశేఖర్ రావు వైస్ ప్రిన్సిపాల్
పలువురు పాల్గొన్నారు..