Thursday, March 28, 2024
HomeTrending Newsబొట్టు బిళ్ళలకు మోసపోవద్దు – మంత్రి హరీష్

బొట్టు బిళ్ళలకు మోసపోవద్దు – మంత్రి హరీష్

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మీటర్ మార్పు వంటి పత్రాలు ఈ ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పని చేసే ప్రభుత్వం, పని చేసే నాయకుడు ఉంటే పని ఎంత వేగంగా జరుగుతుందో దీని వల్ల అర్థమవుతుంది. హుజురాబాద్ లో భూమి అధిన, నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, ఇంటి అనుమతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు , గంగుల కమలాకర్ , ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు కొద్ది మంది నేతలు తమ బాధలను ప్రజల బాధగా రుద్ది లాభపడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం ప్రజల బాధను , తమ బాధగా భావించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే…పెంచిన ధరలకు ప్రజలు మద్ధతు ఇస్తున్నారని చెప్పి సిలిండర్ ధర మూడు వేలు, మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారన్నారు.  ఓటుకు రెండు వేలు ఈ ఒక్క రోజు చేతిలో పెట్టి, రేపటి నుండి సిలండర్ ధర మూడు వేలకు పెంచి మన వద్ద నుండి వసూలు చేస్తారు. బొట్టుబిల్లలు, గడియారాలకు మోసపోవద్దని మంత్రి కోరారు.

నలభై ఏళ్లు.. దరఖాస్తు ఇచ్చాం… దండం పెట్టాం పనులు కాలేదని మంత్రి హరీశ్ రావు చొరవతో కల సాకారమయిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ఇందు కోసమే.. తెలంగాణకు ముందు కాంగ్రెస్, టీడీపీ వంటి ప్రభుత్వాలను చూడలేదా… ఎనాడు పేదలను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని మంత్రి గంగుల అన్నారు. 72 మంది కళ్యాణ ల క్ష్మి చెక్కులు ఇస్తున్నాం. ఇప్పుడు. గతంలో బిడ్డ పెళ్లి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని మేనమామ గా సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష నూట పదహార్లు ఇస్తున్నారన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి. మోడీ పాలించిన రాష్ట్రం ఉంది. యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రం ఉంది. ఎక్కడైనా పెదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చారా అని మంత్రి గంగుల ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్