Thursday, March 19, 2026
Homeసినిమాత‌ళ‌ప‌తి విజ‌య్ తో దిల్‌ రాజు భారీ చిత్రం

త‌ళ‌ప‌తి విజ‌య్ తో దిల్‌ రాజు భారీ చిత్రం

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు త‌ళ‌ప‌తి విజ‌య్‌. త‌ను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజ‌య్ త‌న 66వ సినిమాను నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకం పై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించ‌నున్నారు. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. త‌ళ‌ప‌తి విజయ్, వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్ష‌కుల్లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

సినిమా రంగం ప‌ట్ల అభిరుచి, నైపుణ్యం క‌లిగిన వ్యక్తుల క‌ల‌యిక‌తో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ప్ర‌స్తుతం విజ‌య్ నెల్స‌న్ ద‌ర్శ‌కత్వంలో చేస్తోన్నతన 65వ చిత్రం ‘బీస్ట్’ పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular