జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) లో భాగంగా రాష్ట్ర ప్రభుతం కొనుగోలు చేసిన 4,097 చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ గ్రామాలు, క్లీన్ పట్టణాలు, క్లీన్ నగరాలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం చేపట్టింది. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వినూత్న విధానాలను అమలుచేయడం ద్వారా సురక్షితమైన, పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
⦿ తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్ధాల సేకరణ కోసం ఇంటింటికి 3 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్ బిన్‌ల పంపిణీ చేస్తారు
⦿ 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తారు
⦿ 231 గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్‌ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరు వాహనాల (480 కాంపాక్టర్ వెహికిల్స్) ద్వారా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌డబ్యూఎం) ప్రాజెక్ట్ వద్దకు చేరుస్తారు.
⦿ 72 ఐఎస్‌డబ్యూఎం ప్రాజెక్టుల వద్ద తడిచెత్త నుంచి కంపోస్ట్ ఎరువు, బయోగ్యాస్ తయారీ, పొడిచెత్త నుండి హానికారక వ్యర్ధాలను నిర్మూలించి, తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకొని వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు.
⦿ కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు ఏర్పాటు చేస్తారు
⦿ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలను బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా అభివృద్ది చేయడం, గ్రామాలు-నగరాలను పరిశుభ్రంగా మార్చడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం
⦿ స్వచ్చ సర్వేక్షణ్ వంటి పోటీలలో మన గ్రామాలు, నగరాలను మెరుగైన ఫలితాలను సాధించేలా చూడడం
గ్రామ పంచాయతీల్లో…
⦿ 23,000 మంది గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ, రవాణా, శుద్దీకరణ, పరిసరాల పరిశుభ్రత
⦿ గ్రామ పంచాయతీలకు 14,000 ట్రైసైకిల్స్ పంపిణీ
మున్సిపాలిటీలలో
⦿ అన్ని మున్సిపాలిటీల పరిధిలో, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం
⦿ చెత్తను వేరు చేసేందుకు వీలుగా మున్సిపాలిటీల పరిధిలో కోటీ ఇరవై లక్షల నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్త బుట్టల పంపిణ
⦿ చెత్త సేకరణ, రవాణా చేయుటకు 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ
⦿ 124 మున్సిపాలిటీలలో 231 గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్‌ల ఏర్పాటు
⦿ 72 మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ల స్థాపన
⦿ లక్ష పై చిలుకు జనాభా కలిగిన 32 మున్సిపాలిటీలలోని డంప్ సైట్లలో వ్యర్ధాల నిర్మూలన
⦿ రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ ట్యాంక్‌లనుండి సేకరించిన వ్యర్ధాలను శుద్ది చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస రావు, విజయవాడ మేయర్, ఎంపీలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.