దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ధరలతో సామాన్యులు బెంబెలెత్తుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల మోత తగ్గిస్తే కాని చమురు ధరల మంటలు చల్లారవని విశ్లేషకులు చెపుతున్నారు. ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తూనే సి.ఎస్.టి, జి.ఎస్.టి ల పేరుతో ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రో మంటలతో పప్పు దినుసుల నుంచి కూరగాయల వరకు అన్ని రెట్లు పెరుగుతున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.84/ltr(రూ.0.30 పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 92.47/ltr(రూ.0.35 పెరిగింది).
ముంబైలో పెట్రోల్ రూ. 109.84/ltr (రూ.0.29పెరిగింది), డీజిల్ రూ .100.29/ltr(రూ.0.37 పెరిగింది)
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 104.52/ltr (రూ.0.29 పెరిగింది) & డీజిల్ రూ. 95.58/ltr(రూ.0.35 పెరిగింది)
చెన్నైలో పెట్రోల్ రూ .101.27/ltr(రూ.0.26 పెరిగింది)& డీజిల్ రూ. 96.93/ltr(రూ.0.33 పెరిగింది)
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.02(రూ.0.31 పెరిగింది), డీజిల్ లీటర్ రూ.100.89(రూ.0.38 పెరిగింది).