Saturday, November 23, 2024
HomeTrending Newsమన ఆక్టోపస్ దేశానికే ఆదర్శం: డిజిపి

మన ఆక్టోపస్ దేశానికే ఆదర్శం: డిజిపి

కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో మన రాష్ట్రానికి చెందిన అక్టోపస్‌ బలగాలు మొదటి స్థానం సాధించాయని, ఇది ఏపీ పోలీసులు, ప్రజలు గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మన గ్రేహౌండ్స్‌ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా అక్టోపస్‌ బలగాలను రీ లొకేట్‌ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్‌ బలగాలు సేవలు అందిచనున్నాయి. గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుంది. నైట్‌ ఫైరింగ్‌ విషయంలో ఏపీ అక్టోపస్‌ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్‌ ఆఫీసర్లు ఉన్నారు. నైట్‌ ఫైరింగ్‌ విషయంలో ఏపీ అక్టోపస్‌ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు.

తప్పుడు ఆరోపణలు చేయొద్దు

ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం  లేదని, ఈ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారని డిజిపి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, తాము కూడా ఆ సంస్థలతో టచ్‌లో ఉన్నామని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, ఈ విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోందని అయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం పరువు పోయేలా కొన్ని పార్టీలు హెరాయిన్ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, కొందరు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే నోటీసులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్