Friday, April 19, 2024
Homeసినిమాఆకట్టుకుంటున్న పుష్ప‌ 'శ్రీవల్లి' సాంగ్ ప్రోమో

ఆకట్టుకుంటున్న పుష్ప‌ ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక న‌టిస్తుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్ డిసెంబర్ 17న ఐదు భారతీయ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ పుష్ప రాజ్, రష్మికల శ్రీవల్లి లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ‌స్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక సెకండ్ సింగిల్ ను అక్టోబర్ 13న ఈ మూవీ నుంచి ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి… మాటే మాణిక్యమాయేనే… న‌వ్వే న‌వ‌ర‌త్న‌మాయేనే’ అంటూ సాగే లిరికల్ సాగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తంశెట్టి మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్