తెలంగాణలోని నిరు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు ఖర్చు చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో రెండు పడక గదుల ఇండ్లను మంత్రి ప్రారంభించారు. 52 ఇళ్ళ ను లబ్దిదారులకు అందించారు.
త్వరలో స్వంత భూమి వున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే పథకం ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొదటగా ఎన్.టి.అర్ఇప్పుడు కేసీఅర్ మాత్రమే రైతులకు మంచి జరిగే పథకాలు ప్రవేశపెట్టారన్నారు. సీఎం కెసిఅర్ ఆశీర్వాదం తో…ఉమ్మడి వరంగల్ జిల్లా ను అభివృద్ది చేస్తున్నామని, మొత్తం గూడెప్పాడ్ లో 92 ఇండ్లు మంజూరు అయ్యాయి.ఇప్పుడు 52 ఇండ్లు పూర్తి కాగా ప్రారంభిస్తున్నాము.మిగితవి త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తాం
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,స్థానిక ప్రజా ప్రతినిధులు,సంభందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.