Monday, June 17, 2024
Homeసినిమాఇంటికి చేరుకున్న సాయి ధరమ్ తేజ

ఇంటికి చేరుకున్న సాయి ధరమ్ తేజ

యాక్సిడెంట్ లో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ నేటి ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ద్వారా వెల్లడించారు.

“ఈ విజయదశమికి ఇంకో ప్రత్యేకత ఉంది, అదే మా సాయి ధరమ్ తేజ పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. యాక్సిడెంట్ లో ప్రాణాపాయం నుంచి బైటపడడం మా అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది అతనికి పునర్జన్మ లాంటిది, హ్యాపీ బర్త్ డే తేజు… అత్త, పెద్ద మామ..శుభాశీస్సులు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ 10, వినాయక చవితి రోజున ఐకానిక్ బ్రిడ్జి సమీపంలో రేసింగ్ బైక్ పై వెళ్తున్న సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ పెట్టుకొని ఉండడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది. వెంటనే సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 35 రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో నేటి ఉదయం సాయి తేజ్ డిశ్చార్జ్ అయ్యాడు.

సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంశలు అందుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్