Saturday, November 23, 2024
HomeTrending News97 కోట్ల టీకా డోసుల పంపిణీ

97 కోట్ల టీకా డోసుల పంపిణీ

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ముందురోజు 19 వేలకు చేరువైన కొత్త కేసులు.. తాజాగా 16 వేలకు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

తాజాగా దేశవ్యాప్తంగా 11,80,148 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,862 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 11 శాతం మేర తగ్గుదల కనిపించింది. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. అందులో 3.33 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 2.03 లక్షల(0.60 శాతం)కు చేరింది.

మృతుల సంఖ్యపై హరియాణా ఎఫెక్ట్..

నిన్న 379 మంది కొవిడ్‌తో మరణించారు. హరియాణ రాష్ట్రం మృతుల సంఖ్యను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది. ఆ రాష్ట్రం నిన్న మరణాల సంఖ్య 174గా చూపింది. గత ఏడాది నుంచి 4,51,814 మంది కరోనా కాటుకు బలయ్యారు.

97 కోట్ల టీకా డోసుల పంపిణీ..

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. పండుగ వాతావరణం నెలకొనడంతో రెండు రోజులుగా ఆ వేగం తగ్గింది. నిన్న 30.26 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 97.14 కోట్ల చేరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్