Sunday, September 22, 2024
Homeసినిమా ‘రౌడీ బాయ్స్’ లో ‘ప్రేమే ఆకాశం’ సాంగ్ విడుదల చేసిన విజయ్

 ‘రౌడీ బాయ్స్’ లో ‘ప్రేమే ఆకాశం’ సాంగ్ విడుదల చేసిన విజయ్

దిల్‌ రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ సినిమా నుంచి ‘ప్రేమే ఆకాశం..’ అనే పాట‌ను రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ లాంచ్ చేశారు.

“ఆశిష్‌, అనుప‌మ‌, డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌తో నాకు ప‌రిచయం ఉంది. వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రౌడీ బాయ్స్ సినిమాలోని సాంగ్ లాంచ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. పెళ్లిచూపులు ముందు నుంచి శ్రీహ‌ర్ష నాకు తెలుసు. హుషారు క‌థ నాకు ముందే చెప్పాడు. యూత్ మీట‌ర్ స్పష్టంగా తెలిసిన ద‌ర్శ‌కుడు. అందుకు ఈ సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని తెలుసు. హుషారు త‌ర్వాత త‌ను చేసిన రౌడీ బాయ్స్ పెద్ద హిట్ కావాలి. అనుప‌మ మంచి పెర్పామెన్స్‌. మొద‌టి సినిమా అనుభ‌వం చాలా గొప్ప‌గా ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయాల‌ని ఆశిష్‌ను కోరుతున్నాను.

త‌ను న‌న్ను క‌లిసిన‌ప్పుడు త‌న‌లోని క్యూరియాసిటీని గ‌మ‌నించాను. దిల్‌ రాజు గారు, శిరీష్‌ గారు సామాన్య‌మైన వ్య‌క్తులు కాదు. వాళ్లు గ‌ర్వ‌ప‌డేలా ఆశిష్ సినిమా చేస్తే చాలు. వాళ్లు గ‌ర్వ‌ప‌డేలా గొప్ప న‌టుడిగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. నిజానికి దిల్‌ రాజు గారు, శిరీష్‌ గారు అస‌లు రౌడీ బాయ్స్. ఎందుకంటే ఎక్క‌డో నిజామాబాద్ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చి సినీ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ్డారు. థియేట‌ర్స్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌.. నిరంత‌రం ఫైట‌ర్స్‌ లా ప‌ని చేశారు. ఇప్పుడు ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తున్నారు. నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చిన వ్య‌క్తులు వాళ్లు. రాజు గారితో మైండ్ బ్లోయింగ్ సినిమా చేయాల‌ని వెయిట్ చేస్తున్నాను. త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాం. న‌వంబ‌ర్ 19న రౌడీ బాయ్స్ విడుద‌ల‌వుతుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్