తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాకు రేషన్ పంపిణీకి లింకు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోని వారికి రేషన్, పెన్షన్ బంద్ చేయనున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.