Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ‘హుషారు’ ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి జంటగా నటించిన చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’.  నందన్ దర్శకత్వంలో రాజు రెడ్డి నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా ‘తెలియదే.. తెలియదే’ అనే పాటకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే ఉండడం మరో విశేషం.

ఈ ఒక్క పాట సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి.  ఇదిలా ఉండగా చిత్రంలోని ‘గగనము దాటే’ వీడియో సాంగ్ ని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.. ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల ఆయింది. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో కార్తికేయ, నిర్మాత బెక్కం వేణుగోపాల్, హీరో దినేష్, పాగల్ డైరెక్టర్ నరేష్, నిర్మాత బాబ్జి, గాయత్రి గుప్త తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా వచ్చిన కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

కార్తికేయ మాట్లాడుతూ “ట్రైలర్స్ పాటలు చాలా బాగున్నాయి. ధ్రువన్ మంచి సంగీతం అందించారు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా నందన్ లాంటి మంచి దర్శకుడు తో ఈ కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా నిర్మించాడు. ఏ మూవీకైనా నిర్మాత దొరకడంచాలా కష్టం. మనకు ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయ్యినట్లు.ఈ సినిమా ద్వారా  ఇండస్ట్రీకి  కొత్త ప్రొడ్యూసర్ రావడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ నందన్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇంకా ఇలాంటి మంచి మూవీస్ ఎన్నో చేయాలి. హీరోయిన్ రమ్య చాలా చక్కగా నటించింది. నా సినిమా RX 100 లోని “పిల్లారా..” సాంగ్ హిట్ అయినప్పుడే అదే ఇయర్ లో అభినవ్ ది ‘ఉండిపోరాదే’ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఇయర్  హిట్ సాంగ్స్ లలో ఎప్పుడూ ఈ రెండు సాంగ్స్  మాత్రమే ఉండేవి. ఈ సాంగ్స్  మధ్యనే కాంపిటీషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు తన సినిమా ఫంక్షన్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ నెల 29 న వస్తున్న ఈ సినిమాతో పాటు విడుదల అవుతున్న అన్ని సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ “చిత్ర నిర్మాత రాజిరెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా నాకు తెలుసు. తనకు సినిమా తీయాలని తపన ఉన్న వ్యక్తి. ఒక చిన్న కథను సెలెక్ట్ చేసుకొని లాక్ డౌన్ టైం లో హుషారు ఫేమ్ అభినవ్ తొ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. తను పడ్డ కష్టానికి ఈ సినిమా ద్వారా కచ్చితంగా ప్రతి ఫలం లభిస్తుంది. ఈ చిత్రం లోని విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. డైరెక్టర్  సాంగ్ పిక్చరైజేషన్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమా సక్సెస్ అయి మా రాజిరెడ్డి ఇంకా మరిన్ని మంచిత్రాలు తియ్యాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com