హుజురాబాద్ మండలం తాళ్లపల్లి ఇంద్రనగర్ వద్ద తాగిన మత్తులో ఉన్న లారీ డ్రైవర్ తన లారీని రైతులపై నుండి తీసుకెళ్లిన దుర్ఘటనలో ఇరవైఐదు మంది వరకూ గాయపడ్డారు, వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలతో మాట్లాడి వారిని స్థానిక ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న గంగుల స్వయంగా బాదితులను పరామర్శించారు, వైద్య సిబ్బందితో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా యంత్రాగానికి ఆదేశాలు జారీచేసారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన పదహారు మందికి హుజురాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందించి పంపించారు, ఎముకలు విరిగి ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్న మిగతా ఆరేడుగురిని వరంగల్ ఆసుపత్రికి పంపించి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆధేశించామన్నారు మంత్రి గంగుల. మరో ఇద్దరికి తలపై గాయాలు కావడంతో ఎమ్మారై స్కాన్ చేయిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రాణనష్టం జరక్కుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ఇతర నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ చిరుమిల్ల తదితరులు క్షతగాత్రుల సహాయక చర్యల్లో పాల్గొన్నారు.